బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండ్ ను చూపెడుతూ సీనియర్ హీరోల సినిమాల పరంగా కూడా మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) రిమార్కబుల్ హోల్డ్ ని సాలిడ్ గా కొనసాగిస్తూ ఊహకందని ఊచకోత కోస్తుంది ఇప్పుడు…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండగ సెలవులు అయిన తర్వాత ఇప్పుడు వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపెడుతూ మాస్ రచ్చ చేస్తుంది…టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలతో పాటు టాప్ పాన్ ఇండియా మూవీస్ పరంగా..
5వ రోజున వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతున్న సినిమా 4వ రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో బుకింగ్స్ తో దూసుకు పోతూ ఉండగా….డే ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా అంచనాలను కూడా మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపోతే మరోసారి 11-12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పాలి…
ఇక ఓవర్సీస్ లో కూడా కుమ్మేస్తున్న సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి జోరుని చూపెడుతున్న నేపధ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా 13.5-14 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 5 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.