బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, తెలుగు రాష్ట్రాలలో సైతం 4-5 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అంచనాలను మించి పోయింది ఇప్పుడు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేసిన తర్వాత 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారగా 5వ రోజు వర్కింగ్ డే కి వచ్చే సరికి మిగిలిన సినిమాల మాదిరిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా…
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 65-70% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ కూడా ఇవాళ కొంచం ఇంపాక్ట్ ఉంటుంది. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ 1.6-1.8 కోట్ల దాకా వెళ్ళే ఛాన్స్ కొద్ది వరకు ఉంది. మొత్తం మీద ఉన్నంతలో సినిమా వర్కింగ్ డే లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా చాలా వరకు బిజినెస్ ను వీకెండ్ లోనే రికవరీ చేయడంతో ఇక వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా…
రెండో వీకెండ్ టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని సాధించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక 5వ రోజు డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది, ఈ కలెక్షన్స్ ని మించిపోతుందో లేదో చూడాలి ఇప్పుడు.