బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు వేస్తూ….
రచ్చ చేస్తూ ఉండగా 5వ రోజున మరోసారి వర్కింగ్ డే లో ఉన్నప్పటికీ ఓవరాల్ గా డీసెంట్ టు గుడ్ హోల్డ్ నే చూపించి దూసుకు పోతుంది సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 4వ రోజుతో కంపేర్ చేస్తే డ్రాప్స్ 20% రేంజ్ కి అటూ ఇటూగానే ఉండగా ఈవినింగ్ షోలకు పర్వాలేదు అనిపించేలా…
ట్రెండ్ కనిపించగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి… ఇక సినిమా ఉన్నంతలో ఇప్పుడు అటూ ఇటూగా 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లెక్క…
కొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓకే అనిపిస్తూ ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో కొంచం ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 3 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 3.2 కోట్ల దాకా షేర్ ని అందుకునే…
అవకాశం అయితే ఉందని చెప్పాలి…..ఓవరాల్ గా సినిమా మరోసారి వర్కింగ్ డే లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మొదటి వారంలోనే సినిమా మంచి లాభాలను అందుకోబోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 5 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.