రీసెంట్ టైంలో ఏ పెద్ద సినిమాకి కూడా రానంత రేంజ్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ మొదటి రోజు ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా రెండో రోజు నుండి సాలిడ్ డ్రాప్స్ ను…
సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ ని ఎలాగోలా కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా అనుకున్న రేంజ్ కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుని సాలిడ్ గా దెబ్బ పడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….
మొత్తం మీద సినిమా 4వ రోజుతో పోల్చితే 5వ రోజు వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా అటూ ఇటూగా 10-12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…సినిమా తమిళనాడులో ఈ రోజు 1.6-2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 3.2-3.5 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా…
సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక మొత్తం మీద వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా ఇక 5వ రోజు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.