బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండగ కి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 4 రోజుల్లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు రాగా 5వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయిన సినిమా డ్రాప్స్ కొంచం హెవీగానే ఉన్నప్పటికీ కూడా మిగిలిన సంక్రాంతి మూవీస్ తో పోల్చితే ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది ఇప్పుడు…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో కొంచం ఎక్కువగానే డ్రాప్ అయినా తిరిగి ఈవినింగ్ షోలలో మంచి ట్రెండ్ నే చూపించింది, ఇక ఆంధ్రలో సీడెడ్ లో సినిమా మంచి హోల్డ్ ని చూపించగా మొత్తం మీద 4వ రోజు తో పోల్చితే 5వ రోజు ఓవరాల్ గా….
55% రేంజ్ లో డ్రాప్ ని సొంతం చేసుకుంది. ఈ లెక్కన సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ 6.50 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7.50 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. అంతకన్నా మించి వసూళ్ళని సినిమా సొంతం చేసుకుంటే ఊరమాస్ హోల్డ్ ని వర్కింగ్ డే లో సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద బాక్స్ అఫీస్ దగ్గర 5 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి…