బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 5వ రోజున వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యింది. కాగా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన సినిమా ఎంతవరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ప్రస్తుతానికి మొదటి 2 షోలకు కొంచం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను…
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా 4వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 60% టు 65% వరకు డ్రాప్స్ ను మేజర్ ఏరియాలలో సొంతం చేసుకుంది ఇప్పుడు. నైజాంలో కొంచం బెటర్ గా హోల్డ్ చేసినా ఓవరాల్ గా డ్రాప్ ఇక్కడ కూడా గట్టిగానే ఉందని చెప్పాలి.
ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి సినిమా కొంచం పుంజుకుంటే కలెక్షన్స్ లో కొంచం గ్రోత్ ఉండొచ్చు. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున అటూ ఇటూగా ఇప్పుడు మొత్తం మీద…
2.2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి మినిమమ్ 2.7 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.