Home న్యూస్ 1st డే 5 సార్లు 100…ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేఒక్కడు ప్రభాస్!

1st డే 5 సార్లు 100…ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేఒక్కడు ప్రభాస్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD Movie) ఇతర హీరోలతో పోల్చితే పాన్ ఇండియా రేంజ్ లో భారీ మార్కెట్ ఉన్న హీరోగా ఏర్పడగా వరుస పెట్టి సినిమాలను చేస్తూ మిగిలిన హీరోల కన్నా కూడా యమ స్పీడ్ గా కొత్త కొత్త రికార్డులను తన లేటెస్ట్ మూవీస్ తో నమోదు చేస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషమని చెప్పాలి.

బాహుబలి సిరీస్ తో వచ్చిన క్రేజ్ ను ఏమాత్రం చెడగొట్టకుండా తన రేంజ్ ని పెంచుకుంటున్న ప్రభాస్ మధ్యలో ఒక్క రాదే శ్యామ్ సినిమాతో మాత్రమే నిరాశ పరచగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాంపెజ్ ను చూపించడం విశేషం. ముఖ్యంగా ఓపెనింగ్స్ పరంగా మిగిలిన స్టార్స్ అందరూ కూడా ప్రభాస్ రాంపెజ్ తో కంపేర్ చేస్తే ఇంకా వెనకే ఉన్నారు..

ఇండియన్ హీరోలలో ఎవ్వరూ కూడా ప్రస్తుతానికి ఓపెనింగ్ డే రికార్డుల విషయంలో ప్రభాస్ దరిదాపుల్లో కూడా లేరంటే ఏ రేంజ్ లో ప్రభాస్ రాంపెజ్ కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు…ప్రభాస్ నటించిన లాస్ట్ 6 సినిమాల్లో 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేశాయి…

బాహుబలి2 తో మొదటి సారి 215 కోట్ల మార్క్ ని దాటిన ప్రభాస్ తర్వాత సాహోతో 126 కోట్ల మార్క్ ని అందుకున్నాడు, తర్వాత ఆదిపురుష్ మూవీ 137 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా సలార్ మూవీ 167 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇప్పుడు కల్కి మూవీ మొదటి రోజు 183 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని..

సంచలనం సృష్టించగా తన కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ ను అందుకున్న ప్రభాస్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనర్ ను ఈ సినిమాతో సాధించాడు. ఇక ఇండియన్ హీరోలలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా 100 కోట్లకు పైగా వసూళ్ళ రికార్డ్ ను మరో లెవల్ లో అందుకోగా మిగిలిన హీరోలు స్పీడ్ పెంచే టప్పటికి ప్రభాస్ ఈ లెక్కని ఇంకా పెంచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here