Home న్యూస్ 5 సార్లు 1 మిలియన్ లైక్స్….చరిత్రలో ఒకే ఒక్కడు!!

5 సార్లు 1 మిలియన్ లైక్స్….చరిత్రలో ఒకే ఒక్కడు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల విషయంలోనే కాదు సోషల్ మీడియా రికార్డుల విషయంలో కూడా కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) మిగిలిన హీరోలతో పోల్చితే అందరి కన్నా కూడా ముందు నిలుస్తూ చరిత్రలో ఎవ్వరూ టచ్ చేయని రేంజ్ రికార్డులతో మెంటల్ మాస్ జాతర సృష్టిస్తూ ఉండటం విశేషం కాగా..

లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు విజయ్ నటించిన కొత్తగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ త్వరలో రిలీజ్ కాబోతూ ఉండగా ఈ సినిమా రీసెంట్ విజయ్ మూవీస్ తో పోల్చితే కొంచం బజ్ తక్కువగా ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా….

ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యి సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. ఇక సినిమా నుండి ఇది వరకు వచ్చిన సాంగ్స్ కి అనుకున్న రేంజ్ లో సోషల్ మీడియాలో రెస్పాన్స్ సొంతం అవ్వలేదు కానీ…ఈ సినిమా ట్రైలర్ కి…

కేవలం 6 గంటల లోపే ఏకంగా 1 మిలియన్ లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఓవరాల్ గా ఈ ఏడాది వచ్చిన ఇండియన్ మూవీస్ ట్రైలర్స్ లో రికార్డ్ కొట్టిన ది గోట్ మూవీ ట్రైలర్ ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో 5 వ సారి 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని…

ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి….ఇది వరకు విజయ్ నటించిన బిగిల్, బీస్ట్, వారిసు, లియో సినిమాల ట్రైలర్ లు 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు 5వ సారి 1 మిలియన్ మార్క్ ని అందుకుని…

టోటల్ గా 5 సినిమాలతో ఇలాంటి ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా మిగిలిన స్టార్స్ ఎవ్వరూ కూడా విజయ్ దరిదాపుల్లో కూడా లేరు అనే చెప్పాలి. ఇక అనుకున్న రేంజ్ లో బజ్ లేని ఈ సినిమాతో ఇప్పుడు రచ్చ చేయడం మొదలు పెట్టగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here