బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే ఎక్స్ లెంట్ టాక్ ని సొంతం చేసుకోగా ఇక కలెక్షన్స్ పరంగా ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయం అని అంతా అనుకున్నారు. సినిమా వీకెండ్ వరకు ఇదే రేంజ్ లో కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది కూడా… కానీ ఎప్పుడైతే వర్కింగ్ డేస్…
స్టార్ట్ అయ్యాయో అప్పటి నుండి సినిమా కలెక్షన్స్ పరంగా గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. కానీ టార్గెట్ మరీ పెద్దది ఏమి కాకపోవడం వలన ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నా ఇంకొంచం కష్టపడితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచే…
అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 42 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. సినిమా 45-50 లక్షల రేంజ్ కి వెళుతుంది అనుకున్నా డ్రాప్స్ గట్టిగానే సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 6 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.46Cr(inc GST)
👉Ceeded: 1.97Cr
👉UA: 1.67Cr
👉East: 77L
👉West: 62L
👉Guntur: 92L
👉Krishna: 70L
👉Nellore: 48L
AP-TG Total:- 14.61CR(24.78CR~ Gross)
Ka+ROI: 2.48Cr
OS – 3.36Cr
Total WW: 20.47CR(36.28CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 6 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.. సినిమాను మొత్తం మీద…
బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 22.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.03 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక రెండో వీకెండ్ లో సినిమా సాధించే హోల్డ్ ని బట్టి సినిమా బ్రేక్ ఈవెన్ ని ఇంకా ఎన్ని రోజుల్లో అందుకుంటుంది అన్నది చెప్పగలం.