బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అన్నీ తలకిందలు చేస్తుంది బంగార్రాజు సినిమా… కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి అనుకున్న టైం లో హెవీ డ్రాప్స్, డ్రాప్ అవుతుంది అనుకున్న టైం లో మంచి హోల్డ్ ని చూపెడుతూ వచ్చిన బంగార్రాజు ఇప్పుడు 6 వ రోజు ఫుల్ వర్కింగ్ డే అవ్వడం, కేసులు ఇంకా పెరిగి పోవడం, 50% ఆక్యుపెన్సీ మరియు చాలా చోట్ల 3 షోలు మాత్రమే పడటం లాంటివి ఓవరాల్ గా…
కలెక్షన్స్ పరంగా 6 వ రోజు సాలిడ్ గా దెబ్బ కొట్టాయి. దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా 5 వ రోజు అంచనాలను అందుకుని మించిపోయినా కానీ 6 వ రోజు మాత్రం అనుకున్న అంచనాలను అసలు అందుకోలేక పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి ఎదురుదెబ్బ తగిలి స్లో డౌన్ అయింది…
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1.4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా కోస్టల్ ఆంధ్ర ఏరియా తప్పితే అన్ని చోట్లా హెవీ డ్రాప్స్ తో కేవలం 91 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర…
దాంతో టోటల్ గా సినిమా 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 7.56Cr
👉Ceeded: 5.83Cr
👉UA: 4.23Cr
👉East: 3.44Cr
👉West: 2.50Cr
👉Guntur: 2.99Cr
👉Krishna: 1.92Cr
👉Nellore: 1.50Cr
AP-TG Total:- 29.97CR(48.50Cr~ Gross)
👉Ka+ROI: 1.60Cr
👉OS – 1.32Cr
Total WW: 32.89CR(55.10CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్…
సినిమా 6 వ రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా మొదటి 4 రోజుల్లో మంచి కలెక్షన్స్ ని సాధించడం హెల్ప్ అవ్వగా టోటల్ గా 39 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 6.11 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సినిమా సెకెండ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.