వీకెండ్ వరకు రిమార్కబుల్ కలెక్షన్స్ తో సత్తా చాటుకున్న లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు అన్నీ నార్మల్ గా ఉంటే ఎలా రెచ్చిపోతుందో అలా రెచ్చిపోయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వచ్చింది కానీ వీక్ డేస్ కి వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది.. వర్కింగ్ డేస్ లో వర్షాల వలన ఇబ్బందులు వచ్చినా 6 వ రోజున సినిమా డ్రాప్ అయిన తీరు ట్రేడ్ మొత్తానికి షాకిచ్చింది అనే చెప్పాలి.
సినిమా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు తో పోల్చితే 30-40% వరకు డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకున్నా కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటాయి అనుకుంటే అలా జరగలేదు, సినిమా 6 వ రోజు…
ఏకంగా 50% కి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, 5 వ రోజు 1.26 కోట్ల షేర్ ని అందుకుంటే 6 వ రోజు 66 లక్షల రేంజ్ షేర్ నే సొంతం చేసుకుని భారీగా దెబ్బ కొట్టింది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 6 వ రోజున 76 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందని సమాచారం.
మొత్తం మీద 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
👉Nizam: 10.40Cr
👉Ceeded: 3.46Cr
👉UA: 2.43Cr
👉East: 1.33Cr
👉West: 1.12Cr
👉Guntur: 1.30Cr
👉Krishna: 1.11Cr
👉Nellore: 69L
AP-TG Total:- 21.84CR(35.43CR~ Gross)
Ka+ROI: 1.20Cr~(updated)
OS – 4.38Cr~
Total WW: 27.42CR(48.10CR~ Gross)
ఇదీ సినిమా 6 రోజుల కలెక్షన్స్ లెక్క.
సినిమాను మొత్తం మీద 31.2 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.58 కోట్ల షేర్ ని సినిమా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు రెండో వారంలో హోల్డ్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది.