బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన పుష్ప సినిమా కి ఆల్ రెడీ దెబ్బ పడుతుంది, అదే టైం లో ఆంధ్రలో థియేటర్స్ మీద రైడ్స్ చేయడం, లైసెన్స్ లేని థియేటర్స్ ని సీజ్ చేయడం, టికెట్ రేట్స్ పెంచిన థియేటర్స్ ని మూసెయ్యడం, ఇక థియేటర్స్ ఓనర్స్ లో టికెట్ రేట్స్ వలన థియేటర్స్ ని టెంపరరీగా క్లోజ్ చేయడం లాంటివి మరింత ఇబ్బంది పెట్టింది ఈ సినిమాకి…
అయినా కానీ ఉన్నంతలో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6వ రోజు మొత్తం మీద 2.08 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇక్కడ వచ్చిన ఎఫెక్ట్ ను సినిమా హిందీ లో సాధిస్తున్న ఎక్స్ లెంట్ కలెక్షన్ హెల్ప్ తో కవర్ చేసింది, ఇక సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ కి…
చేరువ అయ్యే వసూళ్ళని సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ ఆంధ్రలో సినిమా సాధించిన బిజినెస్ కి వచ్చిన కలెక్షన్స్ సాలిడ్ దెబ్బ కొట్టాయి అనే చెప్పాలి. ఇతర భాషల్లో కలెక్షన్స్ రాకుంటే దెబ్బ మరింత ఎక్కువగా ఉండేది. ఓవరాల్ గా సినిమా 6 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 32.14Cr(inc GST)
👉Ceeded: 10.93Cr
👉UA: 5.75Cr
👉East: 3.85Cr
👉West: 3.20Cr
👉Guntur: 4.16Cr
👉Krishna: 3.38Cr
👉Nellore: 2.44Cr
AP-TG Total:- 65.85CR(99.55CR~ Gross)
👉Karnataka: 8.70Cr
👉Tamilnadu: 7.10Cr
👉Kerala: 3.40Cr(corrected)
👉Hindi: 11.20Cr
👉ROI: 2.02Cr
👉OS – 10.45Cr
Total WW: 108.72CR(189CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క.
సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 37.28Cr షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మొదటి వారాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో ముగిస్తుందో చూడాలి.