బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా కలెక్షన్స్ జోరు చూపిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వర్కింగ్ డేస్ లో కూడా ప్రతీ రోజూ అనుకున్న అంచనాలను కూడా మించి పోతూ పరుగును కొనసాగించగా సినిమా 6 వ రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా కలెక్షన్స్ అనుకున్న అంచనాలను ఫస్ట్ టైం అందుకోలేక పోయింది ఇప్పుడు…
సినిమా తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా ఈ సారి అంచనాలు తప్పిన సినిమా 9.54 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది… టికెట్ హైక్స్ ఎఫెక్ట్ 4-5 రోజులతో పోల్చితే 6వ రోజు క్లియర్ గా ఇంపాక్ట్ చూపింది…
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 6 వ రోజు 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు అందుకుంటుంది అనుకుంటే మొత్తం మీద 23 కోట్లకు పైగానే కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది, ప్రతీ రోజూ అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి…
సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 73.15Cr
👉Ceeded: 36.03Cr
👉UA: 20.27Cr
👉East: 10.85Cr
👉West: 9.50Cr
👉Guntur: 13.73Cr
👉Krishna: 10.45Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 180.17CR(267.70CR~ Gross)
👉KA: 26.15Cr
👉Tamilnadu: 23.55Cr
👉Kerala: 5.35Cr(3 days)
👉Hindi: 60.10Cr
👉ROI: 4.85Cr
👉OS – 71.20Cr
Total WW: 371.37CR(Gross- 670CR~)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….
ఫైనల్ గా 6 వ రోజు కొంచం అనుకున్న దాని కన్నా ఎక్కువ డ్రాప్స్ ఉండటంతో కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపినా వీకెండ్ లో మళ్ళీ బ్యాటింగ్ సాలిడ్ గా చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 7 వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి వారాన్ని ఘనంగా సినిమా పూర్తీ చేసుకుంటుందో చూడాలి ఇక…