Home న్యూస్ 100 కోట్ల హీరోయిన్….50 కోట్ల సినిమా….6 రోజుల్లో వచ్చింది ఇది!

100 కోట్ల హీరోయిన్….50 కోట్ల సినిమా….6 రోజుల్లో వచ్చింది ఇది!

1346
0

బాలీవుడ్ లో క్వీన్ సినిమాతో మొదటి సారి 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న కంగనా రనౌత్ తర్వాత తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాతో ఏకంగా 250 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ని అందుకుంది…ఇక లాస్ట్ ఇయర్ మణికర్ణిక సినిమాతో 140 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి మార్కెట్ ను సొంతం చేసుకున్న కంగనా ప్రధాన పాత్రలో తమిళనాడులో అమ్మా అని పిలుచుకునే జయలలిత గారి లైఫ్ స్టొరీగా…

తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తలైవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా వేవ్ ల వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లో రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది… ఆడియన్స్ నుండి సినిమా కి….

మంచి టాక్ లభించినా కానీ ఇటు ఇటు తమిళనాడు లో కానీ అటు హిందీ లో కానీ తెలుగు లో కానీ ఎక్కడా కూడా ఆశించిన కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోలేక పోయింది అని చెప్పాలి. సినిమా మొదటి 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 2.73 కోట్ల గ్రాస్ ని…

సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6 రోజులు పూర్తీ అయిన తర్వాత తమిళ్ లో 5 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ లో 1.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దక్కించుకుంది. తెలుగు లో కంప్లీట్ గా వాషౌట్ అయిపోయిన ఈ సినిమా 60 లక్షల మేర గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

దాంతో టోటల్ గా సినిమా 6.7 కోట్ల గ్రాస్ ను 6 రోజుల్లో సొంతం చేసుకుంది, సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తో బాగానే రికవరీ చేసింది అని మేకర్స్ చెబుతున్నా కానీ 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో 7 కోట్లు కూడా రాబట్టలేక పోవడం దారుణం అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్ ఇప్పుడు భారీ డిసాస్టర్ అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here