Home గాసిప్స్ 6 ఏళ్లుగా హిట్ లేదు…ఏకంగా 140 కోట్ల సినిమాలో ఛాన్స్…ఆ సినిమా మీదే ఆశలు!!

6 ఏళ్లుగా హిట్ లేదు…ఏకంగా 140 కోట్ల సినిమాలో ఛాన్స్…ఆ సినిమా మీదే ఆశలు!!

4521
0

అందరు హీరోలు ఎప్పుడూ ఫామ్ లోనే ఉండరు, హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ అన్నవి కామన్ అని చెప్పొచ్చు, టాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టిన యంగ్ హీరో ఇక తన స్థానాన్ని హీరోల విషయం లో మరింత మెరుగు పరుచుకుంటాడు అని అంతా అనుకుంటూ ఉండగా ఒకటి తర్వాత ఒక ఫ్లాఫ్స్ తో ప్రస్తుతం తనకు ఉన్న మార్కెట్ ని ఆల్ మోస్ట్ కోల్పోయే స్టేజ్ కి వచ్చేశాడని చెప్పొచ్చు.

ఆ హీరోనే రాజ్ తరుణ్… ఆల్ మోస్ట్ 6 ఏళ్ళుగా క్లీన్ హిట్ కి దూరం అయిన ఈ హీరో కి… బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ ని తెలుగు లో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. బాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీం గర్ల్ సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఏకంగా 140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, అలాంటి సినిమా ఇప్పుడు తెలుగు లో రీమేక్ చేయబోతున్న హీరో రాజ్ తరుణ్. రీసెంట్ టైం లో ఒక్కటంటే ఒక్క యావరేజ్ సినిమా కూడా పడలేదు రాజ్ తరుణ్ కి తెలుగు లో…

ఈడో రకం ఆడో రకం మల్టీ స్టారర్ సూపర్ హిట్ తర్వాత 8 సోలో హీరోగా సినిమా లు చేయగా అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి ఫ్లాఫ్ అయ్యాయి. ప్రస్తుతం స్టాండ్ అప్ రాహుల్  సినిమా తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చాంపియన్ అనే మరో సినిమా కమిట్ అయిన రాజ్ తరుణ్ అన్ని సినిమాల లోకి కూడా…

డ్రీం గర్ల్ సినిమా తెలుగు రీమేక్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. ఇంకా మొదలు కానీ ఈ సినిమా పై వార్తలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతూ ఉండగా ఈ సినిమా ఎప్పుడు మొదలు అయి పూర్తీ అయ్యాక ఆడియన్స్ ముందుకు వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇస్తానన్న నమ్మకం తో ఉన్నాడు ఈ యంగ్ హీరో… మరి వరుస ఫ్లాఫ్స్ తో మార్కెట్ కోల్పోయే స్టేజ్ కి వచ్చిన రాజ్ తరుణ్ ఈ రీమేక్ తో మళ్ళీ సత్తా చాటుతాడో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here