టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మరోసారి అందరి అంచనాలను మించి సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు ఇప్పుడు…
తన కెరీర్ లోనే ఏ సినిమాలో లేనంత వైలెంట్ కంటెంట్ తో ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు మరో మైలురాయి ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపాడు…
సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది….వరల్డ్ వైడ్ గా 50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు 60 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటేసి సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా..
నాని కెరీర్ లో ఇప్పుడు రెండో సారి 60 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది…ఇది వరకు రెండేళ్ళ క్రితం సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన దసరా సినిమా నాని కెరీర్ లో మొట్ట మొదటి 60 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా…
సంచలనం సృష్టించగా ఇప్పుడు హిట్3 మూవీతో రెండో సారి ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో 2 సార్లు ఈ రికార్డ్ ను అందుకున్న ఒకే ఒక్క హీరోగా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు..
ఆల్ రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వరుస విజయాలతో రికార్డ్ కొట్టి 400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మూడు 100 కోట్ల గ్రాస్ మూవీస్ ని మూడు 50 కోట్ల షేర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకుని మాస్ రచ్చ చేసి ఇప్పుడు 60 కోట్ల షేర్ రికార్డ్ ను కూడా తన పేరిట లిఖించుకుని మాస్ భీభత్సం సృష్టించాడు…