బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లోనే ఆల్ టైం ది బెస్ట్ ఓపెనింగ్స్ ని భారీ మార్జిన్ తో సొంతం చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా రెండో రోజుకి వచ్చే సరికి వాల్తేరు వీరయ్య రిలీజ్ వలన ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వచ్చింది, పండగ టైంలో కొత్త సినిమా రిలీజ్ ఉంటె అంతకన్నా ముందు రిలీజ్ అయిన మూవీస్ పై ఇంపాక్ట్ పడటం మామూలే…
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని లెవల్ లో 39 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న వీర సింహా రెడ్డి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ ని దాటింది. ఇక రెండో రోజు హెవీ డ్రాప్స్ ఉన్నా కానీ ఆల్ మోస్ట్ అఖండ రేంజ్ లోనే వసూళ్లు అందుకునేలా…
కనిపిస్తున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే ఆవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 10 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవచ్చు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం పెరిగే…
అవకాశం ఉంది. దాంతో 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 60 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు కానీ ఓవరాల్ గా రిమార్కబుల్ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు ఇంతకన్నా కూడా బెటర్ హోల్డ్ ని సినిమా సొంతం చేసుకుని ఉండాల్సింది కానీ ఇవి కూడా మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి.