బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా మొదటి రోజు మిక్సుడ్ టాక్ తో ఓపెన్ అయిన సినిమా…
ఈ రేంజ్ లో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తుందని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఆ రేంజ్ లో హోల్డ్ చూపెడుతూ దూసుకు పోయిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది…
తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోగా నైజాం ఏరియాలో ఎన్టీఆర్ మూవీస్ కి లాంగ్ రన్ ఉండదు అంటూ ఒకప్పుడు ట్రోల్స్ వచ్చేవి కానీ ఇప్పుడు దేవర మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు…
అక్షరాలా 60 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది….మూడో వీకెండ్ దసరా సెలవుల అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా 18 రోజుల్లో నైజాం ఏరియాలో 60 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించగా… నైజాం ఏరియా టోటల్ బిజినెస్ 44 కోట్ల రేంజ్ లో జరగగా ఇప్పటి వరకు సినిమా…
బిజినెస్ మీద ఏకంగా 16 కోట్లకు పైగా ప్రాఫిట్ ను ఒక్క నైజాం ఏరియా నుండే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇప్పటికీ షేర్స్ బాగానే వస్తూ ఉండటంతో దీపావళి వరకు సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఇక్కడ స్టడీగా ఉండే అవకాశం ఉంది. బాక్ టు బాక్ ఇక్కడ రెండు 60 కోట్ల షేర్ సినిమాలతో ఎన్టీఆర్ మాస్ రచ్చ చేశాడు.