బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) 16 రోజులు పూర్తి అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 229.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
607.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు 17వ రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో సాలిడ్ జోరునే అన్ని చోట్లా చూపెడుతూ దూసుకు పోతుంది. ముఖ్యంగా అన్ని చోట్లా ఒకెత్తు అయితే హిందీలో సినిమా అన్ని చోట్ల కలెక్షన్స్ ని డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజున 1.7-1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 2 కోట్ల మార్క్ ని దాటవచ్చు. ఇక హిందీలో ఈ రోజు 5 కోట్లకు పైగా గ్రాస్ సొంతం అయ్యే అవకాశం ఉండగా మిగిలిన అన్ని చోట్ల 1.5 కోటి కి పైగా గ్రాస్ సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 17వ రోజున ఇప్పుడు 8.5-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 231 కోట్లకు పైగా గ్రాస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు…
615 కోట్లు దాటేసి ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా 17వ రోజున మరీ భారీ లెవల్ లో కాకపోయినా మంచి గ్రోత్ నే చూపించింది. ఇలానే సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 17 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.