Home న్యూస్ రిలీజ్ కి 12 రోజుల ముందే 61 లక్షలు ఔట్…ప్రభాస్ క్రేజ్ పవర్!

రిలీజ్ కి 12 రోజుల ముందే 61 లక్షలు ఔట్…ప్రభాస్ క్రేజ్ పవర్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ పై రోజు రోజుకి క్రేజ్ ఇప్పుడు భారీ లెవల్ లో పెరిగి పోతుంది. సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కాబోతుండగా సినిమా కి సంభందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఆల్ రెడీ మొదలు అవ్వడం విశేషం.

అమెరికాలో పలు లోకేషన్స్ లో సినిమా ప్రీ సేల్స్ ఆల్ రెడీ స్టార్ట్ అవ్వగా ప్రీమియర్స్ కి ఇంకా 12 రోజుల టైం ఉండగా ఇప్పటి నుండే బుకింగ్స్ పరంగా జోరు చూపిస్తున్న సినిమా అమెరికాలో ఆల్ మోస్ట్ 115 వరకు లోకేషన్స్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా…

   

అక్కడ ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ ప్రీ సేల్స్ 75 వేల డాలర్స్ మార్క్ ని అధిగమించి ఒక లక్ష మార్క్ వైపు దూసుకు పోతుంది. ఇంకా 12 రోజుల టైం రిలీజ్ కి ఉండగా రిలీజ్ టైం కి బుకింగ్స్ లో సాలిడ్ జోరు ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇండియన్ కరెన్సీ లో 61 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఆల్ రెడీ..

అందుకున్న సినిమా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ లాంటి దేశాల నుండి మరో 15 వేల డాలర్స్ ప్రీ సేల్స్ ను సాధించింది, 3D షోలకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపధ్యంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా ఇండియన్ బాక్స్ ఆఫీస్ తో పాటు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here