యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ మూవీ మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా థియేటర్స్ ని భారీగా కోల్పోయిన సినిమా రెండో వారం ఇక తేరుకునే అవకాశం లేనట్లే అనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర… మొదటి వారం బిజినెస్ లో చాలా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లో సగం టార్గెట్ నే అందుకుంది.
ఇక సినిమా రిలీజ్ అవ్వడం 625 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రెండో వారానికి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 75% కి పైగా థియేటర్స్ ని కోల్పోయింది. సినిమా ఇప్పుడు రెండో వారంలో నైజాం లో 45 థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా సీడెడ్ లో 25 థియేటర్స్ లో…
పరుగును కొనసాగిస్తుంది. ఇక సినిమా ఆంధ్ర ఏరియాలో 70 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. దాంతో రెండో వారంలో సినిమా 140 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. దాంతో ఇక సినిమా సగం టార్గెట్ ను ఈ థియేటర్స్ లో రెండో వారంలో అందుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి ఇప్పుడు… ఇక సెకెండ్ వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.