బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసి సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో వరల్డ్ వైడ్ గా అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసింది మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా… మలయాళ మూవీస్ లో మొదటి రోజున…
ఆల్ టైం ఎపిక్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా సంచలన ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన లూసిఫర్2 మూవీ అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో మాస్ ఊచకోత కోయడం విశేషం అని చెప్పాలి. సినిమా కి మొదటి రోజు కొంత మిక్సుడ్ టాక్ ఉన్నప్పటికీ…
కేరళలో అలాగే ఓవర్సీస్ లో ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించిన సినిమా మిగిలిన చోట్ల టాక్ కొంచం ఇంపాక్ట్ ను అయితే చూపించినా కూడా ఓవరాల్ గా మొదటి రోజు ఇండియాలో 24-25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్నట్లు అంచనా…
అలాగే ఓవర్సీస్ లో సినిమా ఆల్ మోస్ట్ 38-40 కోట్ల రేంజ్ లో మమ్మోత్ గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నట్లు అంచనా…ఫైనల్ లెక్కలు మరింత పెరిగే అవకాశం కూడా ఉండగా…ఓవరాల్ గా మలయాళ ఇండస్ట్రీ లో ఇది వరకు ఓపెనింగ్స్ రికార్డుల మీద…
ఆల్ మోస్ట్ మూడు రెట్లు అధికంగా గ్రాస్ ఓపెనింగ్స్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది… 55 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ఖాయం అనుకున్నా ఆ లెక్క అంచనాలను మించి ఏకంగా 60 కోట్ల మార్క్ ను కూడా దాటేసి ఫైనల్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశమే లేదని చెప్పాలి ఇప్పుడు.