బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కన్నా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సోలో రిలీజ్ ను సొంతం చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి 50 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది. తర్వాత రోజు రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య భారీ పోటిలో ఆల్ మోస్ట్ బాలయ్య సినిమాకి సమంగా కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ అందుకుని దుమ్ము లేపగా…
రెండో రోజు నుండి చూసుకుంటే కంప్లీట్ గా వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో లీడ్ ని చూపించి దుమ్ము లేపగా ఇప్పుడు ఆల్ మోస్ట్ 2 సినిమాలు స్లో అయినా కానీ సంక్రాంతి రేసులో మెగాస్టార్ భారీ మార్జిన్ తో బాలయ్య పై విజయాన్ని నమోదు చేశాడు…
ప్రస్తుతానికి బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా 75 కోట్ల లోపు షేర్ ని అందుకోగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా 120 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఊరమాస్ డామినేషన్ తో సంక్రాంతికి కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది.
మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో వాల్తేరు వీరయ్య సినిమా ఆల్ మోస్ట్ 63 కోట్ల లీడ్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. లాంగ్ రన్ లో ఈ గ్యాప్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఆ గ్యాప్ ఎంత ఉంటుంది అన్నది ఈ వీకెండ్ అయ్యాక క్లియర్ లెక్కలు తెలుస్తాయి అని చెప్పాలి.