రీసెంట్ టైం లో ఇలాంటి దెబ్బ మరే సినిమా కి పడలేదు అనే చెప్పాలి… సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి నెగటివ్ రివ్యూలను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఏ దశలో కూడా అనుకున్న టార్గెట్ ను అందుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించలేక పోయిన ఈ సినిమా మొదటి వారానికే…
బిజినెస్ లో సగానికి సగం కూడా అతి కష్టం మీద వసూల్ చేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వడం 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా రెండో వారానికి వచ్చే సరికి పరిస్థితి ఏ రేంజ్ లో పడిపోయింది అంటే ఏకంగా….
45 థియేటర్స్ లో ఇప్పుడు రెండో వారంలో రన్ కాబోతుంది ఈ సినిమా, నైజాంలో 20 థియేటర్స్ లో టోటల్ ఆంధ్రలో 25 థియేటర్స్ లో రన్ అవుతుంది, ఈ రేంజ్ లో 90% శాతానికి పైగా థియేటర్స్ ని కోల్పోవడం అతి కొద్ది సినిమాలకు మాత్రమే జరిగింది, ఇప్పుడు ఆ లిస్టులో పెద్దన్న సినిమా కూడా ఒకటిగా నిలిచింది, రీసెంట్ టైం లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి.