స్టార్ హీరో కోసం ఏకంగా 6 కోట్ల స్టేడియం కడుతున్నారు!!

0
530

  ఒక సినిమా కోసం భారీ భారీ సెట్టింగులు నిర్మించడం కామనే, బాహుబలి, మరికొన్ని ఇతర సినిమాల కోసం కోట్లు ఖర్చు చేసి ఎంతో శ్రమించి భారీ సెట్టింగులు నిర్మిస్తారు, ఇక స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో సినిమా అయితే ఏదైనా స్టేడియం ను రెంట్ కి తీసుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా కోసం ఏకంగా ఒక స్టేడియాన్నే నిర్మిస్తున్నారు. దాంతో టోటల్ సౌత్ మొత్తం షాక్ అవుతుంది.

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ మరియు అట్లీ ల కాంబినేషన్ లో తెరీ, మెర్సల్ తర్వాత వస్తున్న మూడో సినిమా షూటింగ్ శావేగంగా జరుగుతుండగా ఈ సినిమా కోసం ఊహకందని లెవల్ లో ఓ భారీ స్టేడియం కడుతున్నారట. ఫుట్ బాల్ నేపధ్యంలో…

తెరకెక్కుతున్న సినిమా అవ్వడం తో చెన్నై అవుట్ కర్ట్స్ లో 6 కోట్ల భారీ వ్యయంతో ఫుట్ బాల్ స్టేడియం కడుతున్నారట. అందులో దాదాపు 2 నెలల షూటింగ్ చేస్తారని సమచారం. ఇతర గ్రౌండ్స్ లో చేస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సినిమా లో ఆ స్టేడియం ఎ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!