బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో సాలిడ్ ఫామ్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) ఇప్పుడు చాలా చప్పగా సాగుతున్న టాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద మంచి బజ్ అండ్ క్రేజ్ అయితే…
అన్ని చోట్లా సాలిడ్ గా ఉందని చెప్పాలి…సినిమా బిజినెస్ పరంగా అన్ని చోట్లా మాస్ రచ్చ చేసే రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతుంది. నార్మల్ కమర్షియల్ మూవీ అయితే ఏమో అనుకోవచ్చు కానీ…
ఏ సర్టిఫికేట్ ను తెచ్చుకున్న వైలేంట్ మూవీ కి ఇలాంటి రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండటం మాత్రం మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా నార్త్ అమెరికాలో ఓవరాల్ గా 3 లక్షల డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకోగా… ఇండియా బుకింగ్స్ కూడా రీసెంట్ గా..
ఓపెన్ చేయగా హైదరాబాదులోనే కోటికి పైగా బుకింగ్స్ మార్క్ ని ఎప్పుడో దాటేసిన సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఏకంగా 6 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని మాస్ రచ్చ లేపింది…
ఈ వైలేంట్ మూవీ తో కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నాని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమాకి జస్ట్ హిట్ టాక్ ఒక్కటి బాలెన్స్….ఆ ఒక్క టాక్ కూడా వచ్చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.