బాక్స్ ఆఫీస్ దగ్గర ఏప్రిల్ నెల చాలా చాలా చప్పగా సాగుతుంది…ఈ నెలలో ఆశలు పెట్టుకున్న సినిమాలు అన్నీ తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండగా నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) అయినా జనాలను థియేటర్స్ కి రప్పిస్తుంది అనుకున్నా…
ఏమాత్రం హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోయిన సినిమా వీకెండ్ లోనే చేతులు ఎత్తేసింది. ఇక ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేకపోయిన సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఇక ఖాయంగా కనిపిస్తూ ఉంది.
మొత్తం మీద 6వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కేవలం 31 లక్షల రేంజ్ లోనే షేర్ ని అనుకోగా వరల్డ్ వైడ్ గా 34 లక్షల రెం లో షేర్ ని అందుకోగా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకున్న సినిమా ఇప్పుడు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
6 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Arjun Son Of Vyjayanthi 6 Days Total WW Collections(inc GST)
👉Nizam: 2.28CR~
👉Ceeded: 90L
👉Andhra: 2.88Cr~
AP-TG Total:- 6.06CR(11.00CR~ Gross)
👉Ka+ROI – 34L~
👉OS – 54L~
Total WW Collections – 6.94CR(13.35CR~ Gross)
(32%~ Recovery)
మొత్తం మీద సినిమా 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15 కోట్ల కి పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…