Home న్యూస్ 6 డేస్ ఛావా తెలుగు కలెక్షన్స్…ఆగని ఊరమాస్ కలెక్షన్స్ రాంపెజ్!!

6 డేస్ ఛావా తెలుగు కలెక్షన్స్…ఆగని ఊరమాస్ కలెక్షన్స్ రాంపెజ్!!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా జోరు ని చూపెడుతూ అన్ సీజన్ లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధిస్తున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగు లో కంటిన్యూగా 5 రోజుల పాటు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా గ్రాస్ ను సొంతం చేసుకోగా..

6వ రోజున మరో వర్కింగ్ డే లో మాత్రం సినిమా మరోసారి మంచి హోల్డ్ ని చూపించినా కోటి గ్రాస్ మార్క్ ని దాటలేదు… ఓవరాల్ గా 80-90 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అనుకోగా.. అనుకున్నట్లే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

6వ రోజున ఓవరాల్ గా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా 45 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుని మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి కుమ్మేసింది… ఓవరాల్ గా సినిమా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో…

12.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం కాగా 6 రోజుల్లో టోటల్ షేర్ 6.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సోట్నం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. సినిమా 3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…

బరిలోకి దిగిన సినిమా ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 3.3 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. సినిమా మిగిలిన రన్ లో ప్రాఫిట్ ను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here