బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో మాస్ ఊచకోత కోస్తూ అన్ సీజన్ లో ఎపిక్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది…మాములుగా ఏ సినిమా అయినా కూడా వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో…
కలెక్షన్స్ పరంగా కొంచం స్లో డౌన్ అవుతుంది…కానీ ఛావా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి….వర్కింగ్ డేస్ లో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి..
ఓవరాల్ గా సినిమా 6వ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన రోజు అవ్వడంతో మహారాష్ట్రలో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 30 కోట్ల మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టిస్తూ ఏకంగా 32 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.
సినిమా ఒకసారి హిందీ లో డే వైజ్ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
Total collections – 203.68CR NET💥💥💥💥
వర్కింగ్ డేస్ లో ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన సినిమా 6 రోజుల్లో ఏకంగా 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసింది. వారంలోనే ఈ మార్క్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ తగ్గాల్సిన చోట పెరుగుతూ పోగా….సినిమా అంచనాలను మించిపోతూ…
4వ రోజుకి మించి 5వ రోజు, 5వ రోజుకి మించి ఇప్పుడు 6వ రోజున ఊచకోత కోసిన సినిమా 6 రోజుల్లోనే 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి ఫస్ట్ వీక్ లో 220 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా….లాంగ్ రన్ లో 500 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది అని చెప్పాలి.