సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొదటి రోజే మిక్సుడ్ టాక్ తెచ్చుకోవడం, పోటిలో ఉన్న ఇతర సినిమాలకు బెటర్ టాక్ కూడా రావడంతో కలెక్షన్స్ పరంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోతుంది అస్సలు…
దాంతో పండగ సెలవుల్లో సినిమా వసూళ్లు నిరాశ పరిచే రేంజ్ లో ఉండగా 6వ రోజున కనుమ పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది….ఉన్నంతలో పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా…
ఈ కలెక్షన్స్ టార్గెట్ ను అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి… బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 6వ రోజున తెలుగు రాష్ట్రాలలో సినిమా 2.65 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 4.24 కోట్ల షేర్ ని 8.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 6 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 18.10CR
👉Ceeded: 9.67CR
👉UA: 8.86CR
👉East: 6.88CR
👉West: 3.61CR
👉Guntur: 6.09CR
👉Krishna: 4.82CR
👉Nellore: 3.57CR
AP-TG Total:- 61.60CR(89.30CR~ Gross)
👉KA: 4.70Cr
👉Tamilnadu: 3.75Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 16.00Cr
👉OS – 12.83Cr****approx
Total WW Collections: 99.13CR(Gross- 179.15CR~)
(44%~ Recovery)
మొత్తం మీద సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 123.87 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… అంటే ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో జోరు చూపిస్తే తప్పితే సినిమా కి చుక్కలు కనిపించే లాస్ లు సొంతం అవ్వడం ఖాయమని చెప్పాలి.