లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన హరోం హర(Harom Hara) సినిమా మంచి రివ్యూలనే సొంతం చేసుకుంది. మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకోవడం ఖాయం అనుకున్న సినిమాకి కలెక్షన్స్ వీకెండ్ నుండే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. వర్కింగ్ డేస్ లో అయినా టాక్ స్ప్రెడ్ అయ్యి…
కలెక్షన్స్ లో హోల్డ్ అండ్ గ్రోత్ కనిపిస్తుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగడం లేదు ఇప్పుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో స్లో అయిపోగా బడ్జెట్ కి ఏమాత్రం న్యాయం చేయడం లేదు…ఈ సినిమా కోసం మేకర్స్ ఆల్ మోస్ట్ 20 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టారట. అందులో చాలా మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా రికవరీ అవ్వగా…
థియేటర్స్ నుండి 6.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5వ రోజున 15 లక్షల షేర్ అందుకోగా 6వ రోజున 12 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Harom Hara Movie 6 Days Total WW Collections
👉Nizam: 1.05CR~
👉Total AP: 1.20CR~
AP-TG Total:- 2.25CR(4.55Cr~ Gross)
👉KA+ROI+OS: 0.35Cr~
Total World Wide: 2.60CR(5.45CR~ Gross)
మొత్తం మీద 6.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 3.90 కోట్ల షేర్ దూరంలో ఉంది. అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా పెట్టిన బడ్జెట్ పరంగా చూసుకుంటే రికవరీ మరీ నిరాశకలిగించే విధంగా ఉండటం విచారకం. టాక్ బాగానే ఉన్నా జనాలు మాత్రం సినిమాను చూడటానికి ఏమాత్రం థియేటర్స్ కి రాకపోవడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది…కానీ ఈ వీక్ లో సినిమాలు ఏమి లేవు కాబట్టి సినిమా ఏమైనా పుంజుకుంటుందో చూడాలి.