Home న్యూస్ వర్కింగ్ డే లో జాట్ మూవీ మాస్ హోల్డ్….6 డేస్ లో సగం టార్గెట్ ఔట్!!

వర్కింగ్ డే లో జాట్ మూవీ మాస్ హోల్డ్….6 డేస్ లో సగం టార్గెట్ ఔట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర గదర్2 సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన లేటెస్ట్ మూవీ జాట్(Jaat Movie) సినిమా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి…

సొంతం చేసుకున్న ఈ సినిమా 100 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా డీసెంట్ రివ్యూల హెల్ప్ తో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి టార్గెట్ లో సగం మొత్తాన్ని రికవరీ చేసింది..

5వ రోజు హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో 7.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 6వ రోజున ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయినా కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది. 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా…

అంచనాలను మించి పోతూ ఏకంగా 6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో టోటల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు టోటల్ గా హిందీ లో 54 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని…

ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇప్పుడు 7వ రోజున కూడా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటంతో మొదటి వారంలో టోటల్ గా 60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఎన్ని రోజుల్లో టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here