Home న్యూస్ AP-TG కల్కి 6 డేస్ టోటల్ కలెక్షన్స్….6వ రోజు ఊరమాస్ హోల్డ్!

AP-TG కల్కి 6 డేస్ టోటల్ కలెక్షన్స్….6వ రోజు ఊరమాస్ హోల్డ్!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని చోట్లా అద్బుతమైన హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ…

పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా కి మేజర్ గా కలెక్షన్స్ అన్నీ కూడా నైజాం ఏరియా నుండే వస్తూ ఉన్నాయి, ఆంధ్ర సీడెడ్ ఏరియాలు అనుకున్న రేంజ్ లో సహకరించి ఉంటే ఈ లెక్కలు ఇంకా సాలిడ్ గా ఉండేవి అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

6వ రోజున 7 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా ఆ అంచనాలను మరోసారి మించి పోయింది… 7.89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో మరోసారి హోల్డ్ చేయగా ఇందులో మేజర్ కలెక్షన్స్ నైజాం నుండే రావడం విశేషం… 

ఒకసారి సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD Day 6 AP TG Collections(Inc GST)
👉Nizam: 4.37Cr
👉Ceeded: 84L
👉UA: 85L
👉East: 47L
👉West: 39L
👉Guntur: 32L
👉Krishna: 41L
👉Nellore: 24L
AP-TG Total:- 7.89CR(12.20CR~ Gross)

ఈ కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 129.28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 200.98 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 168 కోట్ల దాకా ఉండగా సినిమా 6 రోజుల కలెక్షన్స్ కాకుండా ఇంకా 38.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ను క్రాస్ చేస్తుంది. ఇలానే జోరు రెండో వీక్ లో కొనసాగిస్తే సినిమా టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here