ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపినా కూడా కోవిడ్ తర్వాత నుండి కంప్లీట్ గా ఫామ్ కోల్పోయిన బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie)ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ హిట్ టాక్ ను…
ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా నిరాశ పరిచే కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండటంతో బాలీవుడ్ ట్రేడ్ మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది అని చెప్పాలి..
మొదటి రోజు లో ఓపెనింగ్స్ ను అందుకున్నా సూపర్ హిట్ టాక్ వలన గ్రోత్ ని చూపించవచ్చు అనుకున్నా వీకెండ్ లో ఓవరాల్ గా 30 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది..
నాలుగో రోజు 4.50 కోట్లు, 5వ రోజున 5.04 కోట్ల కలెక్షన్స్ ని 6వ రోజున కేవలం 3.78 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 42.94 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకున్న సినిమా మొదటి వారంలో ఇప్పుడు 46 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా సినిమా బాక్స్ దగ్గర హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా హిట్ టాక్ తో కూడా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది…