Home న్యూస్ 100 కోట్ల వైపు దూసుకు పోతున్న రైడ్2….6 రోజుల కలెక్షన్స్ ఇవే!!

100 కోట్ల వైపు దూసుకు పోతున్న రైడ్2….6 రోజుల కలెక్షన్స్ ఇవే!!

0

ఛావా తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో మళ్ళీ సినిమాలు జోరు చూపించలేదు…ఇలాంటి టైంలో అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన సూపర్ హిట్ రైడ్ మూవీ కి సీక్వెల్ అయిన రైడ్2(Raid2 Movie) తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉన్నాడు…

సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా కూడా వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా లో 73.83 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతుంది. 5వ రోజున 7.47 కోట్ల రేంజ్ లో వసూళ్ళని 6వ రోజున 7.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని….

సూపర్ స్ట్రాంగ్ గా వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండగా టోటల్ గా 6 రోజుల్లో సినిమా ఇక్కడ 88.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ రన్ ని కొనసాగిస్తుంది…సినిమా ఇండియాలో క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే…

మినిమమ్ 130 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా రెండో వీకెండ్ వరకు ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం. బాలీవుడ్ కి ఈ సినిమాతో మరో సక్సెస్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here