భారీ బడ్జెట్ తో రూపొంది మంచి ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా..ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ ను ఏమి చూపించడం లేదు.
మొదటి వీకెండ్ లోనే చేతులు ఎత్తేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింతగా స్లో డౌన్ అయిపొయింది. దాంతో భారీ నష్టాలను సొంతం చేసుకోవడం కన్ఫాం చేసుకోగా మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక పోతూ ఉండటం విచారకరం అనే చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున 21 లక్షల షేర్ ని అందుకుంటే 6వ రోజుకి వచ్చే సరికి 16 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 19 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా 6 రోజులు…
పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Robin Hood 6 Days WW Collections Report(Inc GST)
👉Nizam: 2.20Cr~
👉Ceeded: 70L~
👉Andhra: 2.21Cr~
AP-TG Total:- 5.11CR(9.70CR~ Gross)
👉KA+ROI: 38L~
👉OS: 78L~
Total WW Collections – 6.27CR(12.42CR~ Gross)
ఓవరాల్ గా సినిమా 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా యింకా 22.23 కోట్ల రేంజ్ లో షేర్ ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా..ఆల్ మోస్ట్ రన్ ఇక ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి ఇప్పుడు.