వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. తానాజీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఓం రౌత్ డైరెక్షన్ లో ఏకంగా 500 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మాణం అవుతున్న ఈ మోషన్ కాప్చర్ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి అందరి లో కూడా…
కానీ ఆ అంచనాలను అన్నింటినీ కూడా ట్రోల్స్ లా మార్చేస్తూ సినిమా అఫీషియల్ టీసర్ తీవ్రంగా ట్రోల్ అవ్వగా సినిమా పై అంచనాలు కాస్తా ఎలా ఉంటుందో అన్న అనుమానాలు మొదలు అయ్యేలా చేయగా, సంక్రాంతికి బరిలోకి దిగుతుంది అనుకున్న సినిమా…
సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది అంటూ వార్తలు వచ్చినా ఇప్పుడు సమ్మర్ కూడా కాదు ఏకంగా సంక్రాంతి నుండి 6 నెలలు పోస్ట్ పోన్ అయ్యి జూన్ 16 న ఆడియన్స్ ముందుకు సినిమా రాబోతుందని మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు…
ఈ రేంజ్ లో ట్రోల్స్ కి సినిమా గురి అవుతుందని టీం ఎక్స్ పెర్ట్ చేసి ఉండరు అనే చెప్పాలి. 500 కోట్ల బడ్జెట్ పెట్టి గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉండటంతో తీవ్రంగా ట్రోల్ అయిన ఈ సినిమా 6 నెలల్లో కంప్లీట్ గా న్యూ గ్రాఫిక్స్ హంగులతో బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేస్తే ఆల్ ఇండియా రికార్డులు బద్దలు అవ్వాలని కోరుకుంటున్నారు ఇప్పుడు అందరూ కూడా.