బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో వచ్చిన ఆచార్య సినిమా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా 4 వ రోజు వర్కింగ్ డే లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోగా సినిమా 5వ రోజు రంజాన్ హాలిడే రోజున కొద్ది వరకు గ్రోత్ ని చూపించి పర్వాలేదు అనిపించగా సినిమా 6వ రోజు వర్కింగ్ డేనే అయినా కానీ కొన్ని చోట్లా…..
రంజాన్ తర్వాత రోజు అవ్వడంతో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కానీ ఆచార్య ఆ అడ్వాంటేజ్ ను అనుకున్న రేంజ్ లో అయితే వాడుకోలేదు. మొత్తం మీద చాలా సెంటర్స్ లో సినిమా షోలు జనాలు లేక షోలు కాన్సిల్ అవ్వగా మిగిలిన చోట్ల సినిమా థియేటర్స్ లో పెర్సేంటేజ్ బేస్ మీద…
రన్ అవుతుంది ఇప్పుడు… మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 46 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి…