యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ వరకు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి పరిస్థితిలో చాలా మార్పులు వచ్చేశాయి. అతి కీలకం అయిన 4 మరియు 5వ రోజుల్లో సినిమా కి వర్షాల వలన తీవ్ర ఇబ్బందులు రాగా నైజాం లో కలెక్షన్స్ కూడా వీకెండ్ తో పోల్చితే రీసెంట్ మూవీస్ లాగా డ్రాప్ అవ్వడం మొదలు అయ్యింది.
ఆ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కొనసాగింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజున సినిమా 1.26 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు కి వచ్చే సరికి సినిమా ఆల్ మోస్ట్ 40% కి పైగా డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అంతంత మాత్రమె ఉండటం తో ఇప్పుడు సినిమా 6 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 60 నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 80 లక్షల మార్క్ ని లేదా అంతకు మించి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.