మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా కానీ స్టడీ కలెక్షన్స్ తో పరుగును ఎక్స్ ట్రా ఆర్డినరీ గా కొనసాగిస్తుంది. సినిమా వర్కింగ్ డేస్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా 6 వ రోజు మరో సారి వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా మరోసారి మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది…
సినిమా 5 వ రోజు తో పోల్చితే 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 25%- 30% వరకు డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం లో మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే ఉండటం తో ఈ రోజు సినిమా…
తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కొంచం ఎక్కువ వసూళ్లు సాధించవచ్చు… ఇక హిందీ లో ఈ రోజు మరోసారి సాలిడ్ గా…
హోల్డ్ చేసిన సినిమా అక్కడ 13 కోట్ల రేంజ్ నుండి 13.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక అండ్ తమిళనాడులలో ఈ రోజు కలిపి 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు…. మొత్తం మీద ఇప్పుడు ఇండియాలో 22 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం…
కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలుపుకుని 25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి అన్ని చోట్లా లెక్కలు బాగుంటే సినిమా ఈ రోజు ఇంకొంచం కలెక్షన్స్ ని ఎక్కువ గానే సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక 6 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏరియాల వారిగా ఏ విధంగా ఉంటాయో చూడాలి.