బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా వీకెండ్ ని పూర్తి చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యి తిరిగి 5వ రోజు హాలిడే అడ్వాంటేజ్ తో కొంచం జోరుని చూపించిన సినిమా…
తిరిగి ఇప్పుడు 6వ రోజు మళ్ళీ వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన తిరిగి అన్ని చోట్లా కూడా ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది ఇప్పుడు. సినిమా 5వ రోజుతో పోల్చితే…
6వ రోజు వర్కింగ్ డేస్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో 80-85% రేంజ్ లో డ్రాప్స్ అటూ ఇటూగా సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా సినిమా ఓవరాల్ గా అన్ని చోట్లా రిపోర్ట్ లు ఇలానే ఉంటే సినిమా 6వ రోజు….
తెలుగు రాష్ట్రాల్లో 10-12 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలపై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా అటూ ఇటూగా…
16 లక్షల నుండి 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం కనిపించడం లేదు కాబట్టి లాంగ్ రన్ ఉండటం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.