Home న్యూస్ 6th డే కోర్ట్ మూవీ కలెక్షన్స్….చిన్న సినిమా మాస్ వీరంగం!!

6th డే కోర్ట్ మూవీ కలెక్షన్స్….చిన్న సినిమా మాస్ వీరంగం!!

0

చిన్న సినిమానే అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా మాస్ కుమ్ముడు కుమ్ముతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా, వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టినా కూడా….

ఏమాత్రం హోల్డ్ తగ్గకుండా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది. సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ లిమిటెడ్ డ్రాప్స్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా….6వ రోజున మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కూడా అన్ని చోట్లా..

మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉంది. ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో 5వ రోజుతో కంపేర్ చేస్తే అటూ ఇటూగా 20-25% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా…మొత్తం మీద ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 90 లక్షల రేంజ్ నుండి…

కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కోటికి పైగా షేర్ ని సాధించవచ్చు. ఇక కర్ణాటకా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మరోసారి కుమ్మేస్తూ దూసుకు పోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా…

1.4-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 1.6-1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద చిన్న సినిమా మాస్ వీరంగం సృష్టిస్తూ వర్కింగ్ డేస్ లో మాస్ రచ్చ చేస్తుంది. ఇక టోటల్ గా 6 రోజుల కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here