బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ తర్వాత 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మాస్ రాంపెజ్ ను చూపెడుతుంది ఇప్పుడు….ఆల్ మోస్ట్ 5వ రోజు మీద బుకింగ్స్ లో…
గ్రోత్ సాలిడ్ గా ఉండగా ఆల్ మోస్ట్ డబుల్ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంది తెలుగు మరియు హిందీ మార్కెట్ లో, తెలుగు లో కొన్ని చోట్ల వర్షాలు ఇబ్బంది పెట్టగా నైట్ షోలకు నైజాంలో కొంచం డ్రాప్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా 6వ రోజు ఎక్స్ లెంట్ గా పూర్తి చేసుకోబోతుంది సినిమా..
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8-8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ కూడా ఉంది కాబట్టి ఫైనల్ లెక్క ఇంకా మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఇక హిందీలో సినిమా ఈ రోజు మొదటి రోజు లెవల్ లో జోరు చూపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 6.5-7కోట్లు ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది..ఇక కర్ణాటక లో కూడా మంచి గ్రోత్ ని చూపించిన సినిమా తమిళ్ మరియు కేరళలో పెద్దగా జోరు చూపించలేదు…
ఇక ఓవర్సీస్ లో ఈ రోజు కొంచం డ్రాప్స్ ఉన్నప్పటికీ వరల్డ్ వైడ్ గా 6వ రోజు ప్రజెంట్ లెక్కలను బట్టి చూస్తూ ఉంటే 15కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం దాటి ముందుకు పోయే అవకాశం ఎంతైనా ఉంది…ఇక ఫైనల్ లెక్కలు బాగుంటే 16-18 కోట్లకు వెళ్ళొచ్చు కానీ…
దానికి నైట్ షోలలో సాలిడ్ ఓవర్ ఫ్లో అవడం అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలకు మించి ఉండాల్సిన అవసరం ఉంది. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేక అంచనాలను అన్నీ కూడా మించి పోయి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇప్పుడు.