నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా మిగిలిన చోట్ల మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తుంది. బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మరికొంత కష్టపడాల్సిన అవసరం ఉంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజుతో పోల్చితే 6వ రోజు మరోసారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
1.4 కోట్ల రేంజ్ నుండి 1.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది… ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ నే చూపెడుతున్న సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. సినిమా ఓవరాల్ గా స్లో స్టార్ట్ తర్వాత సాలిడ్ గా పుంజుకుంది…
సినిమాకి రెండో వీక్ లో కూడా పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేక పోవడంతో లాంగ్ రన్ ని కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది… మొత్తం మీద సినిమా ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…
Devil trailer review please