బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మొదటి షో తర్వాత డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత తిరిగి తేరుకోలేక పోయింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా వీకెండ్ లోనే చేతులు ఎత్తేయగా ఇప్పుడు వర్కింగ్ డేస్ కి వచ్చిన లైగర్ సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోతుంది. 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
భారీగా డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు 6వ రోజు మరోసారి వర్కింగ్ డే లో మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించలేకపోయింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు….
అటూ ఇటూగా 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో సినిమా కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల కన్నా కూడా బెటర్ గానే ఉంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 6వ రోజు అటూ ఇటూగా…
45 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది కానీ 6వ రోజు సినిమా పరిస్థితి చూసిన తర్వాత ఇక నష్టాలు కొద్ది వరకు కూడా కవర్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.