రిలీజ్ అయిన రోజు నుండి ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, హిస్టారికల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ ఊచకోత కోస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్ అయినా కూడా హిందీలో మాత్రం సినిమా ఊహకందని రేంజ్ లో….
మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చిన తర్వాత ఓవరాల్ గా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో మంచి జోరుని చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉంది ఇప్పుడు…. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజుతో పోల్చితే 6వ రోజు సినిమా…
వర్కింగ్ డే లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఆన్ లైన్ బుకింగ్స్ లో 25% రేంజ్ లో డ్రాప్స్ ఉన్నప్పటికీ ఆఫ్ లైన్ లో కూడా పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా 6 కోట్ల రేంజ్ నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు. ఇక కర్ణాటకలో తమిళ్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా కేరళలో మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఓవరాల్ గా మూడు చోట్ల కలిపి 3.5-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
ఇక హిందీలో మరోసారి మాస్ రచ్చ చేస్తున్న సినిమా 37-40 కోట్ల రేంజ్ లో నెట్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా మరోసారి 1 మిలియన్ కి పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, అక్కడ తెలుగు వర్షన్ కన్నా హిందీ వర్షన్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది ఇప్పుడు….
ఓవరాల్ గా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 6వ రోజున 30 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుండి హిందీలో మరింత జోరు చూపిస్తే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.