బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ప్రతీ రోజూ ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ….టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతూ ఉండగా..
ప్రతీ రోజూ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అంచనాలను మించి పోతూ ఉండగా 6వ రోజున సండే అడ్వాంటేజ్ సినిమాకి లభించడంతో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించగా…సినిమా ఊపు ఏ రేంజ్ లో ఉంది అంటే ఏకంగా…
6వ రోజున టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ బెండు తీసే రేంజ్ లో ఊచకోత కోసింది అని చెప్పాలి ఇప్పుడు…6వ రోజు ఫైనల్ లెక్కలు అన్నీ అంచనాలను మించి పోయి ఏకంగా 14 కోట్ల షేర్ మార్క్ ని సైతం తెలుగు రాష్ట్రాల్లో అందుకుని ఊహకందని ఊచకోత కోసింది…
ఇది వరకు 6వ రోజున ఆర్ ఆర్ ఆర్ మూవీ 9.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడేళ్ళుగా ఈ రికార్డ్ అలానే ఉండగా ఇప్పుడు సండే అడ్వాంటేజ్ లభించినా కూడా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా…
6వ రోజున ఫస్ట్ డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని అందుకున్న మూవీగా నిలవడమే కాకుండా ప్రీవియస్ రికార్డ్ మీద సాలిడ్ మార్జిన్ తో సరికొత్త బెంచ్ మార్క్ ని సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది…ఈ రికార్డ్ ను ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.