బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని ఎంజాయ్ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను కొనసాగిస్తూ మంచి లాభాల వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…
5వ రోజు మంచి హోల్డ్ ని చూపించిన తర్వాత సినిమా 6వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యి ఈ రోజు వరకు అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది..
మార్నింగ్ మ్యాట్నీ షోలకు 30% రేంజ్ లో డ్రాప్ ఉండగా, ఈవినింగ్ షోల టైంకి పుంజుకుంటుంది అనుకున్నా కూడా డ్రాప్స్ 35% రేంజ్ లో ఉన్నాయి టికెట్ సేల్స్ లో…ఆఫ్ లైన్ లో కౌంటర్ సేల్స్ పర్వాలేదు అనిపించేలా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఇప్పుడు 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో డ్రాప్ అయిన సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపించేలా…
జోరు చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 6వ రోజున ఇప్పుడు 2-2.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Thandel block buster.. Yuva samrat chaltu kummesadu ee sari…