బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సినిమాలు మొదటి వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా దసరా హాలిడేని అన్ని సినిమాలు బాగా ఎంజాయ్ చేశాయి. ఇక దసరా తర్వాత రోజు కూడా పార్షిక హాలిడే అవ్వడంతో మరోసారి అన్ని సినిమాలు మంచి హోల్డ్ నే చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉన్నాయి…
రవితేజ(Raviteja) నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా 6వ రోజులో అడుగు పెట్టగా 5వ రోజు తో పోల్చితే డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో ఈ రోజు మరోసారి మంచి హోల్డ్ నే సినిమా చూపెట్టింది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా సాలిడ్ గా గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 2 కోట్ల దాకా షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక లియో(LEO Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇక తమిళ్ లో అలాగే కేరళలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా కర్ణాటక మరియు ఇతర చోట్ల సినిమా కొంచం స్లో డౌన్ అయింది.
ఓవరాల్ గా సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 28 కోట్ల రేంజ్ నుండి ఆ పైన కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా ఈ రెండు సినిమాలు ఈ రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Hi in regards to the above article on Leo it has been mentioned it made 25-28 chores on day 7 but the film collected less than 20 crores. As per the news provided by tbeatre association it did not do well in B and C centre. The film only had a decent hold in A centre like Chennai and Coimbatore.