లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, వర్కింగ్ డే లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా తమిళనాడు మరియు ఓవర్సీస్ లలో ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది…
మిగిలిన చోట్ల డ్రాప్ అయినా కూడా తమిళ్ అండ్ ఓవర్సీస్ లో విజయ్ మార్కెట్ పవర్ ను చూపించి కుమ్మేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి 6వ రోజు వర్కింగ్ డే లో తమిళ్ అండ్ ఓవర్సీస్ లో కుమ్మేస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ కంటిన్యూ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 22-25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళనాడులో సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ ఉండటంతో…
6వ రోజు అక్కడ మరోసారి 10 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 11.50-12 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఇక హిందీలో కర్ణాటకలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా కేరళలో డ్రాప్ అవ్వగా ఓవర్సీస్ లో మాత్రం మరోసారి మంచి జోరుని చూపెడుతూ ఉండటంతో…
వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 6వ రోజున 17-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తం మీద వర్కింగ్ డేస్ లో సినిమా ఓవరాల్ హోల్డ్ బాగానే ఉంది…ఇక టోటల్ గా 6 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.